Recent Posts

వివాహం చేసుకోలేదని యువతిపై కాల్పులు,ఆపై ఆత్మహత్య

నెల్లూరు: ప్రేమ అనే పదానికి ఆర్దం,హింసించడం లేక చంపడమో అనే విధంగా మారిపోయింది..ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న అనేక సంఘటనలు ఉదహరణగా నిలుస్తున్నాయి..స్థానికులు తెలిపిన కథనం మేరకు.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పరిధిలోని తాటిపర్తిలో సోమవారం మధ్యహ్నం చోటు చేసుకున్న సంఘటన గ్రామస్థులను ధిగ్ర్భాంతికి గురి చేసింది.. వ్యవసాయ కుటుంబానికి చెందిన మాలపాటి.సురేష్ రెడ్డి (30) బి.టెక్ చేసి చెన్నైలో సాప్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు..దూరపు బంధువైన కావ్య(26) బి.టెక్ చేసింది..అమె కూడా చెన్నైలో సాప్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది..ఇద్దరు తాటిపర్తికి చెందిన వారే.. కావ్య అంటే ఇష్టం పెంచుకున్న సురేష్,,మధ్యవర్తుల ద్వారా కావ్య తల్లి,తండ్రులను సంప్రదించాడు..అయితే ఇప్పడే తమ కుమార్తెకు వివాహాం చేసే ఆలోచన లేదని కావ్య తల్లి,తండ్రులు సున్నితంగా తిరస్కరించారు..కరోనా కారణంగా వీరిద్దరు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తు,తాటిపర్తిలోనే ఇంటి వద్ద వుంటున్నారు..ఈ రోజు మధ్యహ్నం కావ్య ఇంటి వద్దకు వచ్చిన సురేష్,,అమె పిలువగా, ఇంటి బయటకు వచ్చి కావ్యపై సురేష్ రివాల్వర్ పేల్చేడు..మొదటి బుల్లెట్ గురి తప్పింది..దింతో వెంటనే మరో రౌండ్ కాల్చడంతో కావ్య కంటి క్రింద భాగంలో బుల్లెట్ దూసుకుని పోయింది..తుపాకీ శబ్దంతో ఉల్కికి పడిన గ్రామస్థులు అక్కడి చేరుకుని,కావ్యను హుటహుటిన నెల్లూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే,కావ్య మరణించింది..కావ్యపై కాల్పులు జరిపిన సురేష్,, కొద్ది దూరం వెళ్లి తన కణతకు తుపాకీని పెట్టి కాల్చుకున్నాడు..దింతో అతను అక్కడిక్కడే మరణించాడు..ఈ ఘటనతో తాటిపర్తి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి..ప్రేమ అంటే ఒకరి కోసం మరోకరు త్యాగం చేసుకుంటారు అనేది గతంలో చూసే వాళ్లం,,నేటి తరం యువత,తమకు దక్కని అమ్మాయి,మరోకరికి దక్కకూడదన్న కృరమైన ఆలోచనలతో ప్రాణాలను హరించడం చేస్తున్నారు..ఇలాంటి సంఘటనలు దారుణమైన వారి మానసిక ప్రవృత్తి తెలియచేస్తున్నాయి..చివరికి కావ్య,,సురేష్ ఇంట్లో వారి తల్లి,తండ్రులకు మిగిలేది శోకం మాత్రమే..?    

Spread the love
error: Content is protected !!