AMARAVATHINATIONAL

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A…

అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం అవుతుందని రిజర్వ్ బ్యాంకు హెచ్చరించింది.. పది రూపాయల నాణెం చెల్లదని, అది ఫేక్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఈ విషయంపై ప్రజల్లో గందరగోళం ఏర్పడింది..దింతో దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తున్నారు.. భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ 10 లేక 20 రూపాయల నాణేలు ధృవీకరించబడిన కరెన్సీలు,,వాటిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.. ఎవరైనా ఇలాంటి పని చేస్తే, మీరు వారిపై IPC సెక్షన్ 124A కింద ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.. ఈ కేసులో మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *