Recent Posts

2-DG సాచెట్ ధరను ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్

హైదరాబాద్: DRDO రూపొందించిన 2-DG సాచెట్‌ ధరను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రకటించింది..ఒక్కో 2-DG సాచెట్‌ ధర రూ.990గా రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నిర్ణయించింది..చికిత్సలో ఒక్కొక్కరికి 5 నుంచి 10 సాచెట్‌లు అవసరం అవుతాయని,, ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుందని తెలిపింది..కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు,,ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ (2 Dioxin – D glucose‌) ఔషధాన్ని గురువారం 10 వేల సాచెట్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్ పేర్కొంది.. 2-DG మందు పొడి రూపంలో లభిస్తుంది..దానిని నీటిలో కరిగించుకుని తాగాలి..ఈ ఔషధం మన శరీరంలో వైరస్‌ సోకిన కణాల్లోకి చేరుకుని,,ఆ కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది..దీంతో వైరస్‌ వృద్ధి తగ్గిపోతుంది.

Spread the love