Recent Posts

అమెరికాలో 24 గంటల వ్యవధిలో మిలియన్ కరోనా కేసులు నమోదు

అమెరికా: అమెరికాలో క‌రోనా కేసులు అనూహ్యంగా పెరిగిపుతన్నాయి..గ‌త సంవత్సరం డెల్టా వేరియంట్ విజృభించిన సమయంలో సైతం ఒక్క రోజులో అత్య‌ధికంగా 2 ల‌క్ష‌ల వ‌ర‌కు కేసులు న‌మోదు కాగా ఈ సంవత్సరం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కార‌ణంగా ఆదివారం నాడు 5.90 ల‌క్ష‌ల కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. మరుసటి రోజు (సోమవారం) డ‌బుల్ స్థాయిలో మిలియ‌న్ క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంట‌ల్లో సుమారు 4 ల‌క్ష‌ల కేసులు అద‌నంగా పెర‌గ‌డంతో యూఎస్ లో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అర్థంమౌతుంది.. గత కొంత కాలంగా మందకొండిగా సాగిన వ్యాక్సినేష‌న్ ప్రక్రియ అక్కడి అధికారులు వేగంగా అమ‌లు చేస్తున్నా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.. ప్ర‌పంచంలో ఏ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో ఒక్క‌రోజులో మిలియ‌న్ కేసులు న‌మోదు కాలేదు. కేసులు పెరుగుతుండ‌టంతో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  మాస్క్‌ లు ధ‌రించాల‌ని,, ఆర్హులైన ప్రతి ఒక్క‌రూ త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని అధికారులు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు..అగ్రరాజ్యం అయిన అమెరికాలో కేసుల సంఖ్యలో అగ్రస్థానంలో కొనసాగుతుంది..?

Spread the love
error: Content is protected !!