Recent Posts

DRDO 2 డీఆక్సీ-డీగ్లూకోజ్ మందును విడుదల చేసిన రాజ్ నాథ్ సింగ్

అమరావతి: కరోనా వైరస్ పాజిటివ్ బాధితుల చికిత్సలో కీలకం మారానున్న DRDO 2 డీఆక్సీ-డీగ్లూకోజ్ మందును రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్,కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ లు సోమవారం విడుదల చేశారు.. 10 వేల ప్యాకెట్లను ఢిల్లీలోని కొన్ని హాస్పిటల్స్ అందించారు..పౌడర్  రూపంలో వుండే 2DG మందును నీటిలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది..DRDO అభివృద్ధి చేసిన 2DGని హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తోంది..2DG పౌడర్ రూపంలో వుండే ఈ మందు రెండు,,మూడు దశల ట్రయల్స్ లో మంచి ఫలితాలు రావడంతో,,ఈ మందు అత్యవసర వాడకానికి ఇటీవలే డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది..2DG మందుతో కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం తగ్గుతుందని,,హాస్పిటల్స్ లో ఉండాల్సిన పరిస్థితి దాదాపు తగ్గుతాయని తెలిపారు..ఈ మందు అన్ని వయసుల వారికి పనిచేస్తుందని,,2DG తీసుకున్న పేషెంట్లలో రెండు మూడు రోజుల్లోనే తేడా కనిపించిందని వివరించింది..2DGని గతంలో క్యాన్సర్ కోసం ఈ మందు తయారు చేశారు..శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు..ఇదే నియమాన్ని కరోనా వైరస్ కు వర్తించే విధంగా పరిశోధనలు చేశారు..శరీరంలో ప్రవేశించిన కరోనా వైరస్ కణాలకు గ్లూకోజ్ అందకూండా చేయడంతో కణ విభజన జరగదని,,దింతో శరీరంలో కరోనా వైరస్ వ్యాప్తీ నిలచి పోతుందని DRDO తెలిపింది..

Spread the love