Recent Posts

రాజశేఖర్, జీవిత రూ.26 కోట్లు ఎగనామం పెట్టేందుకు పన్నాగం-హేమ,కోటేశ్వర రాజు

నేను ఎక్కడికి పరిపోలేదు-జీవిత..

అమరావతి/హైదరాబాద్: సినీ నటుడు రాజశేఖర్, జీవితపై నగరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోద అయ్యింది…గరుడ వేగ సినిమాకు డబ్బులు తీసుకుని దాటవేస్తున్నారని జోస్టర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యజమానులు హేమ,,కోటేశ్వర రాజులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..మద్రాసులోని తేన్నంపేట,తిరువళ్లూరులో వారి ఆస్తులు తమ వద్ద తనఖా పెట్టి 26 కోట్ల రూపాయలు తీసుకుని,,ఒరిజనల్ డాక్యుమెంట్లు మా వద్ద వుంటే,,సదరు ఆస్తులకు సంబంధించి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి  మాకు తెలియకుండా విక్రయించారని ఆరోపించారు..రాజశేఖర్, జీవితతో జాగ్రత్తగా ఉండాలని,,వాళ్లు చాలా మంచివాళ్లగా నటిస్తుంటారని అన్పారు..

నేను ఎక్కడికి పరిపోలేదు-జీవిత:- చెక్ బౌన్స్ కేసుపై జీవితా రాజశేఖర్ స్పందిస్తూ, తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. గరుడ వేగ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో జీవితా రాజశేఖర్ తమను మోసం చేశారంటూ జోస్టార్స్ ప్రొడక్షన్ కు చెందిన కోటేశ్వరరాజు, మేనేజింగ్ డైరెక్టర్ హేమ చేసిన ఆరోపణలపై.. మీడియా సమావేశంలో పాల్గొని,,జీవిత వివరణ ఇచ్చారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ కొట్టిపారేశారు. సుమారు రెండు నెలల నుంచి ఈ కేసు కోర్టులో ఉందని, తాజాగా కోటేశ్వరరాజు, హేమ ప్రెస్ మీట్ పెట్టి తమపై ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదన్నారు. ఈ కేసుకు సంబంధించి 2 నెలల క్రితమే వారెంట్ వచ్చిందని, తనకెలాంటి సమన్లు అందలేదన్నారు. ఈ విషయంలో తాము దేనిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Spread the love
error: Content is protected !!