Recent Posts

త్వరంలో 180 భారత్ గౌరవ్ రైళ్ళను ప్రారంభం-రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతి: పర్యాటక రంగంలో మరిన్ని మౌలిక వసుతులను పెంచి, టూరిజంను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొత్తగా 180 భారత్ గౌరవ్ రైళ్ళను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు..మంగళవారం అయన మీడియాతో మాట్లాడుతూ ఈ రైళ్ల  సేవల నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు. భారత్ గౌరవ్ రైళ్ళ కోసం 3,033 బోగీలను గుర్తించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఈ రైళ్ళ నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైందని,,ఈ పథకానికి మంచి స్పందన లభిస్తోందన్నారు.ఈ బోగీలను ఆధునికీకరించి, రైళ్ళను నడుపుతారని,,పార్కింగ్, మెయింటెనెన్స్, ఇతర సదుపాయాల విషయంలో రైల్వేలు సహాయపడతాయని,పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రైళ్ళను ప్రవేశపెట్టబోతున్నామన్నారు.. 

Spread the love
error: Content is protected !!