Recent Posts

రఘురామకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించాలి-సుప్రీమ్

అమరావతి: వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తు,, సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్ప‌త్రిలో అతనికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించాలని ఆదేశించింది..ఈ స‌మ‌యాని ర‌ఘురామ కృష్ణంరాజు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న‌ట్టుగా భావించాల‌ని సూచించింది..తెలంగాణ హైకోర్టు ఒక జ్యుడీషియ‌ల్ అధికారిని నామినేట్ చేస్తుంద‌ని,,సదరు జ్యుడీషియ‌ల్ అధికారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఎం.పికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలంటూ,,ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీ,, తెలంగాణ హైకోర్టు రిజిస్టార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది..వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేయాల‌ని,,వైద్య ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని స్ప‌ష్టం చేసింది..వైద్య ప‌రీక్ష‌ల నిర్వహణకు అయ్యే ఖ‌ర్చు మొత్తం ర‌ఘురామ‌ కృష్ణమరాజు భ‌రించాల‌ని పేర్కొంది..ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.. ర‌ఘురామ‌కృష్ణంరాజు ప్ర‌స్తుతం గుంటూరు సెంట్ర‌ల్ జైలులో వున్నారు..

Spread the love