AMARAVATHICRIME

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు..
అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ఐదుగురి జీవితాలు మంటల్లో ఆహుతి అయ్యియి.. టిప్పర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని అనంతలోకాలకు తీసుకెళ్లింది.. ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొట్టడంతో బస్సు,,టిప్పర్ డ్రైవరుతో సహా ఐదుగురు సజీవదహనమయ్యారు..ఈ సంఘటనలో మరో 20 మంది గాయపడ్డారు.. పల్నాడు జిల్లా పరిధిలోని చిలూకలూరిపేట మండలం ఓడరేవు-పిడుగురాళ్ల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….మంగళవారం రాత్రి అరవింద ట్రావెల్స్‌ బస్సు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌కు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది..బస్సులో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు..వీరంతా సోమవారం జరిగిన ఎన్నికల్లో ఓటేసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైయ్యారు..రాత్రి 1.30 గంటల సమయంలో బస్సు చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారి పాలెం- పసుమర్రు గ్రామాల మధ్యనున్న ఈవూరివారిపాలెంకు చేరుకోగానే జాతీయ రహదారి నిర్మాణంలో వుండడంతో,వాహనల రాకపోకలకు తత్కాలికంగా నిర్మించిన సర్వీసు రోడ్డులో ఎదురుగా కంకర లోడుతో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది..క్షణాల్లో టిప్పర్‌లో మంటలు చెలరేగి వెంటనే బస్సుకు అంటుకున్నాయి..మంచి నిద్రలో వున్న ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ కిందకు దిగేలోపే దాదాపు 20 మందికి మంటలు అంటుకున్నాయి..బస్సు,,టిప్పర్ డ్రైవర్‌ తో సహా ఐదుగురు బస్సులోనే సజీవ దహనమయ్యారు..వారిలో కాశీ బ్రహ్మేశ్వారావు(62) అయన భార్యలక్ష్మి (55) వారి మనువరాలు శ్రీసాయి(9) మంటల్లోనే ఆహుతి అయ్యారు.బస్సులోని చాలా మంది ప్రయాణికులు,బస్సు అత్యవసర ద్వారం నుంచి క్రిందకు దూకి వేసి ప్రాణాలు దక్కించుకున్నట్లు ప్రయాణికులు తెలిపారు..
స్థానికులు వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు.. వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు..అదే సమయానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు..క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *