Recent Posts

నిబంధనల నడుమ కొనసాగిన పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర

అమరావతి: ఒడిశాలో పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర ఘ‌నంగా కరోనా నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతుంది..నేడు ఆషాఢ శుక్ల విదియ సమయంలో వేద‌ పండితులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి  జగన్నాథా నామసర్మణతో ఉత్సవ‌మూర్తుల‌ను క‌దిలించ‌డంతో ర‌థ‌యాత్రా ప‌ర్వం మొద‌లైంది..3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుంది..మ‌హారాజు బంగారు చీపురుతో ర‌థాల‌ను ఊడ్చిన అనంత‌రం ర‌థ‌యాత్ర మొద‌లైంది..కోవిడ్ మ‌హ‌మ్మారి కల్లోలం నేపథ్యంలో గ‌త సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం భ‌క్తుల‌ను అనుమతించలేదు..ఈ ఉత్సవాలను పూరీ రాజు,వేది పండితులు, ఆల‌య అర్చకులు, సిబ్బంది క‌లిసి రథయాత్రను ఘ‌నంగా నిర్వహిస్తున్నారు..

Spread the love