Recent Posts

మే నెలకు 13 లక్షల వ్యాక్సిన్ డోసుల కొనుగోలు-ఆరోగ్య శాఖ్య ముఖ్య కార్యదర్శి

45 ఏళ్లు దాటిన వారికే ప్రాధాన్యత…

అమరావతి: కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు మే నెలకు సంబంధించి 13 లక్షల వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వాటిలో 9,91,700 కొవిషీల్డ్, 3,43,930 కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయబోతున్నామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం నాటికి ప్రభుత్వాసుపత్రుల్లో 29 వేల రెమ్ డిసివిర్ ఇంజక్షన్లు అందివ్వగా, నేడు 30,559 ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు. మొదటి కేసుల వచ్చిన వారందరూ ఆసుపత్రుల్లో చేరిపోయారన్నారు. ఎక్కువ లక్షణాలున్న వారికి మాత్రమే ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందజేస్తున్నామని, తక్కువ లక్షణాలున్నవాకికి కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించి సేవలు అందిస్తున్నామని ఆయన వివరించారు.హోం ఐసోలేషన్లో ఉండే బాధితుల కోసం ఐఏఎస్ అధికారి నియామకం:-హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. హోం ఐసోలేషన్ ఉన్నవారికి కిట్లు అందాయా..? మందులు అందుతున్నాయా…? ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోడానికి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పరామర్శిస్తున్నారా..? అనేవిషయాన్ని రాష్ట్రస్థాయిలో నోడల్ అధికారి పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. మే నెలలో 13 లక్షల వ్యాక్సిన్ డోసుల కొనుగోలు:-కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు మే నెలలో 9,91,700 కొవిషీల్డ్ డోసులు, 3,43,930 కోవాగ్జిన్ వాక్సిన్ల డోసులను…మొత్తం 13 లక్షలకు పైగా డోసులను ఏపీ ప్రభుత్వం కొనుగోలు  చేయనుందన్నారు. ఆ రెండు కంపెనీలతో మాట్లాడుతున్నామని, త్వరలోనే కొనుగోలు చేయబోతున్నామని ఆయన తెలిపారు. ధరల విషయం ఆ రెండు కంపెనీలతో ఇంకా చర్చించలేదన్నారు.వ్యాక్సినేషన్ లో 45 ఏళ్లు పైడిన వారికే ప్రాధాన్యత:- ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వ్యాక్సిన్ ను 45 ఏళ్ల పైబడిన వారికి వినియోగిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారు కోటీ 48 లక్షల మంది ఉన్నారన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వారు  2 కోట్లా 4 లక్షల మంది ఉన్నారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన తరవాతే ఇతరులకు వ్యాక్సిన్ వేయాలన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమన్నారు. ఇదే విషయమై పీఎం నరేంద్రమోడికి సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. మే ఫస్ట్ నుంచి 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయడంలేదన్నారు. 

Spread the love