Recent Posts

రాజీనామాను సోనియాగాంధీకి పంపిన పంజాబ్ పిసీసీ అధ్యక్షడు నవజ్యోతిసింగ్ సిద్దూ

అమరావతి: సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయగానే ఒక్కసారిగా పంజాబ్ పాలిటిక్స్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి..సిద్ధూ రాజీనామా, అమరీందర్ సింగ్ హస్తిన పర్యటనతో ఒక్కసారిగా పంజాబ్‌లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.మధ్యాహ్నం తన పీసీసీ పదవితో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేసి,రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పంపిన సిద్ధూ, లేఖలో పరోక్షంగా కెప్టెన్‌పై విమర్శలు చేశారు..అమరీందర్‌కు వ్యక్తిత్వం లేదని,తన స్వార్థం కోసం లాలూచీ పడతారని మండిపడ్డారు.పంజాబ్ భవిష్యత్తే తనకు ముఖ్యమని, సంక్షేమం విషయంలో ఎవరితోనూ రాజీపడనన్నారు..ఇందుకు బదులు ఇస్తు,పంజాబ్ లాంటి దేశ సరిహద్దు రాష్ట్రంకు పీసీసీ చీఫ్‌గా అతడు సరిపోడని తాను ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు.ఇదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ చేరుతారనే వార్తలు సంచలనం సృష్టించాయి.తాను ఏ రాజకీయ నేతను కలిసేందుకు రాలేదని, ఢిల్లీలో తన క్వార్టర్స్ ఖాళీ చేసేందుకే వచ్చానని క్లారిటీ ఇచ్చారు.ఇదంతా ఒకెత్తయితే సిద్ధూ రాజీనామా తర్వాత పరిణామాలు పతాక స్థాయికి చేరాయి.సిద్ధూకు మద్దతుగా ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.

Spread the love