Recent Posts

డొమినికాలో పట్టుబడ్డ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు

అమరావతి: 2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న నిందితుడు అయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ విదేశంలో అదృశ్యమయ్యాడనే వార్తలు వచ్చాయి..అయితే డొమినికా నుంచి క్యూబాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా మంగళవారం ఆయన పట్టుబడినట్లు సమాచారం.. చిన్నబోటు ద్వారా డొమినికా చేరుకున్న మెహుల్ చోక్సీ,, అక్కడ్నుంచి క్యూబాకు పారిపోయేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్న సమయంలో స్థానిక డొమినికా పోలీసులు పట్టుకుని,,అతడిని కస్టడీలోకి తీసుకున్నారు..ఇప్పటికే మెహుల్ చోక్సీపై అంతర్జాతీయ లుకౌట్ & రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి..అక్కడి పోలీసుల అదుపులో ఉన్న మెహుల్ చోక్సీని నేరుగా భారత్‌కు అప్పగించాలని ఆంటిగ్వా ప్రభుత్వం,,డొమినికా ప్రభుత్వాన్ని కోరింది..2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం బయటపడటంతో నీరవ్ మోడీతోపాటు మెహుల్ చోక్సీ దేశం వదిలి పరారయ్యారు..నీరవ్ మోడీకి మెహుల్ చోక్సీ మేనమామ అవుతాడు.. సుమారు రూ.14 వేల కోట్ల PNB స్కాంలో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు.. PNB స్కాం కేసులో వీరిని ఇండియా తీసుకువచ్చి విచారించేందుకు CBIతోపాటు ED ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి..

Spread the love