Recent Posts

నగరంలో ఇక నుంచి రాత్రి 11 గంటలకు పబ్ లు,బార్లు బంద్-కమీషనర్

హైదరాబాద్‌: నగరంలో  పబ్‌లు,బార్లకు ఇకు నుంచి రాత్రి 11 గంటలకకు క్లోజ్ చేయాలని పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ కొత్త నిబంధనలు పెట్టారు..పుడ్డింగ్ & మింక్ పబ్ కేసులో కొకైన్ లభ్యం కావటంతో పోలీసుశాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది..నగరంలోని దాదాపు 100 బార్లు, పబ్‌ల ప్రతినిధులతో కమీషనర్ శుక్రవారం సమావేశం నిర్వహించి,,పబ్‌ల నిర్వహణకు కొత్త నియమావళిని వారి తెలియాచేశారు..ఇక నుంచి ప్రతి ఒక్కరూ ఈ సమయాలను ఖచ్చితంగా పాటించాలని కోరారు..పబ్‌లు,,బార్లలో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల బ్యాక్ అప్ నెల రోజుల పాటు జాగ్రత్త చేయాలని ఆదేశించారు..అలాగే సౌండ్ పొల్యూషన్ విషయంలో ఖచ్చితంగా నిబందనలు పాటించాలని,,ఒక వేళ ఏవరైన నిబంధనలు పాటించకుంటే,,పబ్బులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. రాత్రి 11 గంటలకు వచ్చే ఆర్డర్లను అంగీకరించవద్దని,,శుక్ర,శనివారాల్లో బిల్ సెటిల్ చేయటానికి,, అరగంట గ్రేస్ పీరియడ్ అదనంగా మరో గంట మినహాయింపు వుంటుందన్నారు..

Spread the love
error: Content is protected !!