నెల్లూరు: సతీష్ థావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో ప్రయోగించిన(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)PSLV- C52 రాకెట్, ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది..శ్రీహరి కోట(SHAR) నుంచి 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 5.59 గంటలకు వాహకనౌక (EOS-04) IRSat-1,INS-2TD, InspireShot-1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది..18.31 నిమిషాల తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను రాకెట్ దిగ్విజయంగా ప్రవేశపెట్టింది.ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రకటించారు..శాస్త్రవేత్తల ఆవిరళంగా చేసిన కృషి ఫలించిందని,ఈ సందర్బంగా వారికి అభినందనలు తెలిపారు..
2022లో ఇదే మొదటి ప్రయోగం:- ఇస్రోకు 2022లో ఇదే తొలి ప్రయోగం..అలాగే ఇస్రో ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో మొదటి ప్రయోగం..
IRSat-1: 1710 kgలు బరువు వుండే దీని జీవితకాలం 10 సంవత్సరాలు.నిరంతరం అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా డిజైన్ చేశారు..
INS-2TD : 17.5 kgలు బరువు.. భారత్, భూటాన్ కలిసి రూపొందించిన ఈ ఉపగ్రహ జీవితకాలం ఆరు నెలలు. భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం రూపొందించారు. దీని బరువు 17.5 కిలోలు.
InspireShot-1: 8.1 kgలు బరువు.. విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారుచేశారు. జీవితకాలం 1 సంవత్సరం. తక్కువ భూకక్ష్యలో ఉండే ఈ ఉపగ్రహంలో భూమి అయానోస్పియర్ అధ్యయనం నిమిత్తం కాంపాక్ట్ అయానోస్పియర్ ప్రోబ్ అమర్చి ఉంటుంది..