Recent Posts

గ్లోబల్ లీడర్‌లలో అగ్రస్థానంలో నిలిచిన ప్రధాని నరేంద్రమోదీ

అమరావతి: భారతదేశ ప్రధాని నరేంద్రమోదీకీ ప్రపంచ వ్యాప్తంగా మరింత క్రేజ్ పెరిగింది. ప్రజలు ఎక్కువగా ఇష్టపడే నాయకుల్లో ప్రధానిమోడీ తొలి స్థానంలో ఉన్నారు..మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 70 శాతం మంది ఆమోదంతో మిగతా దేశాల నేతలతో పొల్చుకుంటే ప్రధాని మోడీ టాప్‌ లో ఉండగా,ఆ తరువాత స్థానాల్లో మిగతా దేశాల నేతలు ఉన్నారు.ఈ విషయాన్ని కేంద్రమంత్రి పియూష్ గోయాల్ ‘కూ’ యాప్‌ ద్వారా వెల్లడించారు.. సదరు సంస్థ ప్రకటించిన ఈ లిస్ట్‌ లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, కెనడా ప్రధాని ట్రూడో, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో తదితరులు ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ 70 శాతం ఆమోదంతో మరోసారి గ్లోబల్ లీడర్‌లలో అగ్రస్థానంలో నిలిచారని పియూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ 13 మంది ప్రపంచ నేతల కంటే ముందుగా ఉన్నారని సర్వే ద్వారా తేలింది.ఇటాలియన్ ప్రధాని మారియో డ్రాగి, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల కంటే ప్రధాని మోడీ ముందున్నట్లు సర్వేలో తేలింది..

సర్వేలో వెల్లడైన నేతల పేర్లు:-1.నరేంద్ర మోదీ-70 శాతం,,2.లోప్ ఒబ్రాడర్-66 శాతం,,3.మారియో డ్రాగి-58 శాతం,,4.ఏంజెలా మెర్కెల్-54 శాతం,,5.స్కాట్ మోరిసన్-47 శాతం,,6.జస్టిన్ ట్రూడో-45 శాతం,,7.జో బిడెన్-44 శాతం,,8. ఫ్యూమియో కిషిడా-42 శాతం,,9.మూన్ జే ఇన్-41 శాతం,,10.బోరిస్ జాన్సన్-40 శాతం,,11.పెడ్రో శాంచెజ్-37 శాతం,,12.ఇమ్మాన్యుయేల్ మాక్రాన్-36 శాతం,,13.జైర్ బోల్సోనారో-35 శాతంగా వున్నారు.. ప్రతి దేశంలోని కొంతమంది ఇంటర్వ్యూల ఆధారంగా మార్నింగ్‌ కన్సల్ట్‌ సంస్థ ఈ జాబితాను తయారు చేస్తుంది.మార్నింగ్ కన్సల్ట్ సంస్థ,ఇండియాలో 2,126 మందిని ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేసింది.అమెరికన్ డేటా ఇంటెలిజెన్స్ సంస్థ,మార్నింగ్ కన్సల్ట్ పలు దేశాలలోని అగ్ర నాయకులకు రేటింగ్ ఇచ్చాయి..

Spread the love
error: Content is protected !!