Recent Posts

న్యూయార్క్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

అమరావతి: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సదస్సులో నేడు ప్రసంగించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత సంవత్సరం ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు..న్యూయార్క్ చేరుకున్న విషయాన్ని ప్రధాని ట్వీట్ చేసారు. ‘న్యూయార్క్ సిటీకి చేరుకున్నాను. సెప్టెంబర్‌ 25న సాయంత్రం 6.30 గంటలకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ లో పేర్కొన్నారు..న్యూయార్క్‌ చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది.

Spread the love