Recent Posts

108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

అమరావతి: హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్ లోని మోర్బీలో నిర్మించిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని పీఎం మోడీ శనివారం వర్చువల్ గా ఆవిష్కరించారు..ఈ సందర్బంలో ప్రధాని ప్రసంగిస్తూ దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో రామ కథ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం..ఏ భాష అయినా,, రామ కథ స్ఫూర్తి అందరిని ఒక్కటి చేస్తుంది..అది దైవత్వానికి చేరువ చేస్తుంది..ఇదే భారతదేశ సంప్రదాయం,,నమ్మకం,,ఆధ్యాత్మికత,, సంస్కృతికి బలం..చెడుపై మంచి విజయం సాధించేందుకు శ్రీరాముడు విశేషంగా కృషి చేశారు. “హనుమాన్జీ 4 ధామ్” ప్రాజెక్ట్ లో భాగంగా దేశంలో నాలుగు దిశల్లో,, నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది..ఇందులో భాగంగా పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు..ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండోది.. తొలి విగ్రహాన్ని 2010లో హిమచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఏర్పాటు చేశారు..అలాగే దక్షిణ దిశలో తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించారు..అలాగే నాల్గవ విగ్రహాం బంగాల్​లో నిర్మించనున్నట్లు చెప్పారు.

Spread the love
error: Content is protected !!