Recent Posts

రేపటి నుంచి అందుబాటులోకి రానున్నE-Rupi

ప్రారంభించనున్న ప్రధాని..

అమరావతి: బ్యాంకులో అకౌంట్ వున్న వారిలో దాదాపు 90 శాతం మంది డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లో PhonePe, GPayలను ఉపయోగిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి మరొక సర్వీసును తీసుకురానున్నారు.అందుబాటులో ఉన్న పేమెంట్ విధానాలకంటే చాలా సులభంగా క్యాష్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఉండేలా ‘ఈ – రూపీ’ (E-Rupi)ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. ప్రధాని మోడీ చేతులమీదుగా ప్రారంభించనున్న ‘ఈ రూపీ’ రేపటి (అగష్టు 02వ తేదీ) నుంచి అమల్లోకి వస్తుంది.కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందే లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండానే..ప్రభుత్వ సాయం అందనుంది.లబ్దిదారుల ఉపయోగించే మొబైల్ ఫోన్ కు క్యూ ఆర్ కోడ్, SMS వౌచర్ రూపంలో నగదు జమ అవుతుంది..ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను QR code లేదాSMS వోచర్ ల ద్వారా లబ్దిదారుడి స్మార్ట్ ఫోన్ కి పంపిస్తారు.ఈ క్యూ ఆర్ కోడ్ ను లబ్దిదారుడు అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. డిజిటల్ లావాదేవీల ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ – రూపీ యాప్ ను అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Spread the love