Recent Posts

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

అమరావతి: రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) కింద 9వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు..దాదాపు 9.75 కోట్ల మంది పైగా రైతు కుటుంబాలకు రూ.19,500 కోట్లు అందనున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు పలువురు రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సింగ్‌లో మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ రంగం గురించి  ప్రధాని చర్చించారు..ప్రధాన మంత్రిగా మోదీ పాలన చేపట్టినప్పటి నుంచి క్రమం తప్పకుండా, పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తోంది. ఏటా మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేలు చొప్పున అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి..ఇప్పటివరకు ఈ స్కీమ్ కింద రైతుల కోసం మొత్తంగా రూ.1.30 లక్షల కోట్లను కేంద్రం విడుదల చేసింది.. 

Spread the love