Recent Posts

ప్రధాని మోదీ,పవార్ సమావేశం

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీతో NCP అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, శరద్‌ పవార్‌ల భేటీకి సంబంధించిన ఫొటోను ప్రధాని కార్యాలయం ట్విట్టర్‌లో షేర్ చేసింది.. ‘రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్, ప్రధాని మోదీతో భేటీ అయ్యారు’అని పేర్కొంది.ఇరువురు నేతల మధ్య దాదాపు 57 నిమిషాల పాటు భేటీ జరిగినట్టుగా శరద్ పవార్ కార్యాలయం తెలిపింది..అంతకు ముందు బీజేపీ రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయ‌ల్‌తో పవర్ శుక్రవారం సంప్రదింపులు జరిపారు.పార్లమెంట్ వర్షకాల సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు పవార్,మోదీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడానికి ప్రతిపక్ష నేతలతో పలువురు మంత్రులు సంప్రదింపులు జరుపుతున్నారు.. గతవారంలో శరద్‌ పవార్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రెండుసార్లు సమావేశం అయ్యారు..ఆటు తరువాత ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ,ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకలతో కూడా సమావేశం అయ్యారు..ఈ నేపథ్యంలో పవార్‌ను రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి..అయితే ఆ వార్తలను శరద్ పవార్ ఖండించారు.రాష్ట్రపతి ఎన్నికల బరీలో లేనని వెల్లడించారు.ఈ పరిణామాల నేపథ్యంలో మోదీతో శరద్ పవార్ భేటీ రాజకీయంగా చర్చకు దారి తీసింది..త్వరలో మాహారాష్ట్ర రాజకీయాల్లో ఏవైన మార్పులు చోటు చేసుకోనున్నాయా?

Spread the love