అమరావతి: క్వాడ్ సమ్మిట్ లో పాల్గొంనేందుకు జపాన్ కు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ,, NEC కార్పొరేషన్ ఛైర్మన్ నోబుహిరో ఎండోతో సోమవారం సమావేశమయ్యారు..టెలీ కమ్యూనికేషన్ రంగంలో దిగ్గజమైన NEC పాత్రను ప్రధాని మోడీ ప్రశంచించారు..భారత్ లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల విషయమై NEC ఛైర్మన్ తో చర్చించినట్లు విదేశాంగ శాఖ ప్రకటనలో తెలియచేసింది..యూనిక్లో సీఈవో తదాషి యానే తో టెక్స్ టైల్ మార్కెట్, టెక్స్ టైల్ ప్రాజెక్టుల కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద, పెట్టుబడి అవకాశల గురించి చర్చించారు..అలాగే సుజుకి మోటర్ కార్పొరేషన్ సలహాదారు ఒసామ్ సుజుకీ, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ మసయోషి సన్ లతో సమావేశమైనట్లు విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు..జపాన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీకి ప్రవాశ భారతీయలు ఘన స్వాగతం పలికారు..మోదీ..మోదీ అనే నినాదలతో ప్రాంగణం దద్దరిల్లింది..
More Stories
G-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
అఫ్ఘనిస్తాన్కు భారతదేశం,మానవతా దృక్పథంతోభారీ సహాయం
అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో భూప్రకంపనలు-రిక్టర్ స్కేలుపై 6.1