Recent Posts

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు శంకుస్థాపన ప్రధాని మోదీ

అమరావతి: ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు ప్రధాని మోడీ శనివారం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో శంకుస్థాపన చేశారు.రూ.8,300 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది..ఇదే సమయంలో ఉత్తరాఖండ్‌లో రూ18,000 కోట్ల చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్రం లక్ష కోట్లకు పైగా ఆమోదం తెలిపిందని,,నేడు ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులకు రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు..దేశంలో అధునాతన మౌలిక వసతుల కల్పనకు రూ.100 లక్షల కోట్లు పెట్టుబడి లక్ష్యంగా ముందుకు వెళ్లుతున్నమన్నారు..ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కారిడార్ సిద్ధమైన తరువాత ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణించే సమయం సగానికి సగం తగ్గుతుందని చెప్పారు..మన పర్వతాలు, సంస్కృతి కేవలం మన విశ్వాసానికి సంబంధించిన అంశాలే కాకుండా దేశ భద్రతకు పెట్టని కోటలన్నారు..పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలు సులభంగా జీవనయానం సాగించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు..దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వారు ఇందుకు సంబంధించి ఎలాంటి విధానపరమైన వ్యూహం రూపొందించడపోవడం దురదృష్టకరమన్నారు.. 2007 నుంచి 2014 మధ్య కాలంలో ఉత్తరాఖండ్‌లో రూ.600 కోట్లతో కేవలం 288 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణం జరుపగా,, తమ ప్రభుత్వం పాలన చేపట్టిన తరువాత ఉత్తరాఖండ్‌లో రూ .12,000 కోట్లతో 2,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం జరిపిందన్నారు..

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి… మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు రాజకీయాల కోసం రాష్ట్రానికి ఉన్న మంచి పేరు చెడగొట్టాలని చూస్తున్నారని,,తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం వారి ఆటలు చెల్లవని తాను చెప్పదలచుకున్నానని అన్నారు..ఇలా మాట్లాడే వారు గతంలో చేసిందేమీ లేదని,,అలాంటి శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు.

Spread the love
error: Content is protected !!