Recent Posts

డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: భారత దేశంలో సంప్రదాయ వైద్యం పరిఢివిల్లిందన్న విషయం తనకు తెలుసునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ అన్నారు..జామ్ నగర్‌లో డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం అయన మాట్లాడారు..ఈ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. డబ్ల్యూహెచ్ఓ, భారత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మార్చి 25వ తేదిన ఒప్పందం కుదుర్చుకున్నాయి..ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఘెబ్రెయెసుస్ మాట్లాడుతూ  భారత దేశంలోని సంప్రదాయ వైద్యం గురించి తాను తెలుసుకున్నానని,ఈ సందర్బంగా తన గురువులకు కృతజ్ఞుడినని చెప్పారు..తాను బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపారు. బాలీవుడ్ ఫ్యాన్స్‌ కు స్విస్ అల్ప్స్ పర్వతాలు అంటే చాలా ఇష్టమైన ప్రదేశమని చెప్పారు.. సాక్ష్యాధారాలుగల సంప్రదాయ వైద్యాన్ని బలోపేతం చేయడానికి సైన్స్ శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు..ఈ ముఖ్యమైన కార్యక్రమానికి సహకరిస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు..తాత్కాలిక కార్యాలయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 250 మిలియన్ డాలర్లను సమకూర్చినందుకు,, పదేళ్ళపాటు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తామని హామీ ఇచ్చినందుకు  మోదీకి ధన్యవాదాలు తెలిపారు…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, టెడ్రోస్ హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో మాట్లాడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఈ విధంగా మూడు భాషల్లో మాట్లాడటం తమ హృదయాలను తాకిందన్నారు..

Spread the love
error: Content is protected !!