Recent Posts

వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్దిపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రధాని మోదీ

అమరావతి: వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్దిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కలెక్టర్లు తదితరులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్బంలో వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇందుకు తమ తమ జిల్లాల్లో ప్రగతిని కలెక్టర్లు వివరించారు..క్యాంప్‌ కార్యాలయం నుంచి వీసీలో సీ.ఎం.జగన్‌,,సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, అటవీ,పర్యావరణం,సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి విజయ్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love
error: Content is protected !!