Recent Posts

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దిగి రానున్న వంటనూనెల ధరలు

అమరావతి: వంట గదిలో కుంపటి పెడుతున్నాయి వంట నూనెల ధరలు.. అమాంతం పెరిగిపోయిన వంట నూనెల ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి… పెట్రో,డీజిల్,గ్యాస్ ధరలు పెరుగుతూపోతున్న సమయంలో,వంట నూనెల ధరల పెరగడంతో దీని ప్రభావం సామాన్య,మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోంది..వంటనూనెల ధలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పండుగల వేళ వినియోగదారులకు శుభవార్త చెప్పింది..ముడి పామాయిల్‌, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నూనెలపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.. వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్‌ను కూడా తగ్గించింది.దీంతో దేశీయంగా వంట నూనె ధరలు కొంత వరకు తగ్గనున్నాయి.కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ముడి పామాయిల్‌పై ఉన్న అగ్రిసెస్‌ 7.5 శాతానికి, ముడి సోయాబిన్‌ ఆయిల్‌, ముడి పొద్దుతిరుగుడు నూనెపై 5.5 శాతానికి తగ్గిపోయింది.. ఇక రిఫైన్డ్‌ వంట నూనెలపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.కేంద్రం తగ్గించిన ఈ ధరలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి..పండుగ సీజన్‌లో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖ బుధవారం రెండు నోటిఫికేషన్‌లను జారీ చేసింది..

Spread the love