Recent Posts

గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని-కేంద్ర ఆరోగ్య శాఖ

అమరావతి: గర్భిణీలు కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ గైడ్ లైన్స్ విడుదల చేసింది..కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయినా లేదా నేరుగా వెళ్లి అయినా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది..కేంద్ర ఆరోగ్య శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది..ఇప్పటివరకు గర్భిణీలు,, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయడంలేదు..అయితే ఈ మధ్య పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది..ప్రస్తుతం  గర్భిణీలు కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు పాలసీలో మార్పులు చేసింది..గర్భిణీలకు వ్యాక్సిన్ బాగా ఉపయోగపడుతుందని..వారికి కచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని ICMR డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఈ ఇటీవలే ప్రకటించారు..గర్భిణీలకు వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ మీటింగ్ లో మే నెలలోనే చర్చలు జరిగగా నేటికి నిబంధనలు విడుదల అయ్యాయి..

Spread the love