Recent Posts

స్మార్ట్ ఫోన్’ జియోఫోన్ నెక్ట్స్ కు వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్ ?

అమరావతి: రిలయన్స్ జియో ప్రపంచంలో ‘అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్’ జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్‌ 10వ తేదిన ముఖేష్ అంబానీ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.కస్టమర్స్ డిమాండ్ ను దృష్టిలో వుంచుకుని,ఈ ఫోన్‌కి ప్రీ బుకింగ్స్‌ పెట్టాలని జియో నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు వచ్చే వారం నుంచి  ప్రీ బుకింగ్స్‌  ప్రారంభం కానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి..ఫీచర్స్‌ ?-5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్, 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. చేతిలోకి ఫోన్ వచ్చేవరకు వినియోగదారులు వేచిచూడాల్సిందే?  

Spread the love