Recent Posts

మేయర్ గా ప్రయాణ స్వీకారం చేసిన 12వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి స్రవంతి

డిప్యూటివ్ మేయర్లు-రూప్ కుమార్,ఖలీల్..

నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ గా పొట్లూరి స్రవంతి, డిప్యూటీ మేయర్లుగా పోలుబోయిన.రూప్ కుమార్, మహమ్మద్ ఖలీల్ అహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు ప్రకటించారు. సోమవారం నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పాలకమండలి ప్రత్యేక సమావేశం కమిషనర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాలక మండలి సమావేశం నిర్వహణకు అవసరమైన 30 మంది సభ్యుల హాజరు కంటే అధికంగా కోరం ఉన్నందున సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.అనంతరం జిల్లా ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్ పర్యవేక్షణలో 54 డివిజన్లలో విజేతలైన అభ్యర్థులు ఒక్కొక్కరి చేత జిల్లా కలెక్టర్  ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి మేయర్ అభ్యర్థిగా 12వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి స్రవంతి పేరును 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస ప్రతిపాదించగా, 21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ళ గౌరీ బలపరిచారు.డిప్యూటీ మేయర్ గా 40 డివిజన్ కార్పొరేటర్ పోలు బోయిన రూప్ కుమార్ పేరును 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి ప్రతిపాదించగా, ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మొగుళ్లపల్లి కామాక్షి దేవి బలపరిచారు.అలాగే మరో డిప్యూటీ మేయర్ గా 43వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ పేరును 44వ డివిజన్ కార్పొరేటర్ నీలి రాఘవరావు ప్రతిపాదించగా, 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున బలపరిచారు. వీరి ఎంపికకు సభ్యులందరూ ఆమోదం తెలపగా  ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల పరిశీలకులు పుష్పగుచ్ఛాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు..

Spread the love
error: Content is protected !!