Recent Posts

పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా లేదా రద్దు చేయండి-ప్రజారోగ్యవేదిక

నెల్లూరు: పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే కలిగే ఇబ్బందులను, ఈ పరీక్షలతో ముడిపడీ ఉన్న సున్నితమైన సమస్యలను వాస్తవ పరిస్థితులును  దృష్టిలో వుంచుకుని,,పరీక్షలు జరిగితే వచ్చే సమస్యలను కూడా పరిశీలించాలని ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు డాక్టరు.రమణయ్య,కామేశ్వరావులు ముఖ్యమంత్రికి వినతి పత్రంలో కోరారు.. ఈ విద్యాసంవత్సరంలో అన్ని పాఠశాలల్లో,కళాశాలల్లో పాఠ్యాంశాలు  చాలా వరకు  పూర్తి చేయలేకపోయారు. కోవిడ్ నిబంధనలతో  పరీక్షలు జరుపుతామని,నిబంధనలు ఎంతవరకు విద్యార్థులకు రక్షణ ఇస్తాయి, మాస్క్ వేసుకుంటారు, భౌతిక దూరం పాటిస్తారని ప్రశ్నించారు..జ్వరం లేకుండానే ఎసింటమేటిక్ క్యారియర్ దశలో ఉన్న వారిని ఎలా గుర్తిస్తారు?.  ఒకవేళ  పరీక్షలు నిర్వహించాలని అనుకున్నప్పుడు ఈ కరోనా సెకండ్ వేవ్  ఉధృతి తగ్గాక కనీసం ఒక నెల పాఠశాల లు,కళాశాలలు నడుపుకోవడానికి అవకాశం ఇచ్చి  విద్యార్థులును సన్నద్ధం చేసి తరువాత పరిక్షలు నిర్వహించవచ్చన్నారు.. పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలు రద్దు చేసి అందర్నీ పాస్ చేసి, విద్యార్థులు మంచి కాలేజీలు సీటు సంపాదించాలంటే ఒక ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ రాయించి, అందులో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి కాలేజీల్లో  సీట్లు కేటాయించండి..ఒకవేళ పరీక్షలు నిర్వహించినా  భయంతో వస్తున్నటువంటి విద్యార్థులు ఎలా రాయగలుగుతారు. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి అవుతారని తల్లిదండ్రులు ఆందోళన  చెందుతున్నారు.కనుక పై విషయాలన్నింటినీ సానుకూలంగా ఆలోచించాలని కోరారు..

Spread the love