Recent Posts

సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం-పోలీసులకు ప్రకాష్ రాజ్ ఫిర్యాదు

అమరావతి: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(MAA) ఎన్నిక‌లు ముగిసి వారం రోజులు గడుస్తున్నప్పటికి,ఈ వర్గాల మధ్య  వివాదం సద్దుమణగలేదు.విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ మ‌ధ్య ఈ ఎన్నిక‌ల్లో విష్ణు ప్యాన‌ల్ విజ‌యం సాధించిన విష‌యం విదితమే..ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని,రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాశ్‌ రాజ్ ఆరోపణలు చేశారు. సాధరణ రాజకీయ పార్టీల ఎన్నికల తీరును మా ఎన్నికలు జరిగాయని,ఎన్నిక‌ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాలు చేశారు..ఓట్ల లేక్కింపులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నిక‌ల అధికారి  కృష్ణ మోహన్ కు లేఖ రాశారు.అయితే ఎన్నిక‌ల అధికారి కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని సమాధానం ఇచ్చారు.దింతో ఈ వివాదం కొత్త కోణం చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్,, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్ర‌కాశ్ రాజ్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు, సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు..ఈ చర్యలతో తెలుగు సినిమా పరిశ్రమలో పైకి కన్పించని వేడి చోటు చేసుకుంది.ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి..

Spread the love
error: Content is protected !!