Recent Posts

టీడీపీ నేత పట్టాభిరాంను అరెస్ట్ చేసిన పోలీసులు

అమరావతి: టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాంను ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో పట్టాభిపై కేసులు నమోదు చేశారు. పట్టాభిని గవర్నర్‌పేట పీఎస్‌కు తరలించారు.అతనిపై 120బీ,505,504 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.తన భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పట్టాభి భార్య చంద్ర అన్నారు. సెక్షన్‌ 120 బి కింద పట్టాభిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. పోలీసులపై తనకు నమ్మకం లేదన్నారు. తమ ఇంటిపై దాడి చేసిన వారిని ఇంతవరకూ అరెస్ట్‌ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పటమట పీఎస్‌లో కేసు నమోదయ్యిందని పోలీసులు చెప్పినట్లు తెలిపారు. తలుపులు బద్దలుగొట్టి మరీ ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కనీసం ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా చూపించలేదని పట్టాభి భార్య చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love
error: Content is protected !!