AGRICULTUREAMARAVATHI

జగన్ అహంతో చేసిన దుస్సాహసమే పోలవరం వినాశనం-చంద్రబాబు

పోలవరంపై శ్వేత పత్రాన్ని విడుదల..
పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ శాపంలా మారాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు మండిపడ్డారు..శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు పోలవరంపై శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ప్రభుత్వ పాలనపై తీవ్రంగా విమర్శించారు..వివిధ అంశాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేయడంతో పాటు రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరించాలని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు..వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టుకుని కరవు రహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు పోలవరం అని వివరించారు..2014 -19 తమ ప్రభుత్వ హయాంలో 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104 సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తించి 72శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు..
        ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాలి…రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టే ఇంత అఖండ విజయం అందించారు…మీడియాను కూడా భయపెట్టే పరిపాలన గత ఐదేళ్లలో జరిగింది… న్యాయస్థానాలను సైతం బ్లాక్ మెయిల్ చేసేలా న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని విమర్శించారు… రాష్ట్ర పునర్ నిర్మాణo జరగాల్సిన పరిస్థితి నెలకొంది… వివిధ అంశాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని నిర్ణయించాం… ప్రజా సహకారంతో రాష్ట్రాన్ని నిలబెడతాం… ఇందులో భాగంగా బడ్జెట్ కంటే ముందే తొలుత 7 శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు…
          రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరం…1941 నుంచి తెలుగు ప్రజల కలగా పోలవరం ఉంది… 90 మీటర్ల కిందవరకూ డయాఫ్రమ్ వాల్ అత్యాధునిక సాంకేతికతతో పూర్తిచేశాం…పోలవరం అంత భారీ ప్రాజెక్టు దేశంలో ఇక ఉండదేమో? 2014లో తెలంగాణలో 7 ముంపు మండలాలు నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీలో విలీనం జరిగేలా కృషి చేశామన్నారు..
డయాఫ్రమ్ వాల్ ను రూ.436 కోట్లతో పూర్తి చేస్తే… ఇప్పుడు మరమ్మతులకు రూ.447 కోట్లు అవుతుంది… ఇంత ఖర్చు చేసినా నష్టం పూర్తిగా భర్తీ అవుతుందని చెప్పలేం… కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఇప్పుడు రూ.990 కోట్లు అదనంగా ఖర్చవుతుంది…ఇందుకు 2 నుంచి 4 సీజన్ల సమయం కూడా వృధా అవుతుంది… జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది…2019 జూన్ నుంచి ఏజెన్సీలు తొలగించి పోలవరం పనులు నిలుపుదల చేశారు…డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం రెండేళ్ల తర్వాత కానీ గుర్తించలేదు…
పిచ్చి కుక్క, పిచ్చి కుక్క… అని పదే పదే చెబుతూ మంచి కుక్కని చంపేసిన మాదిరి జగన్ పోలవరం పట్ల వ్యవహరించారు… ప్రాజెక్ట్ ను సర్వనాశనం చేసేందుకు జగన్ అహంతో చేసిన దుస్సాహసమే పోలవరం వినాశనం…
          మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే అప్పర్, లోయర్ కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయి… గైడ్ బండ్ దెబ్బతినడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణమూ ఆగిపోయింది…మొత్తంగా పొలవరాన్ని గోదాట్లో ముంచేశారు…ఇప్పుడు కేంద్రం అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి నిరంతర అధ్యయనం పెట్టింది… రాష్ట్రంలో వున్న సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు ఎత్తేయటంతో అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఆధారంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి… నిర్ణీత సమయానికి పోలవరం పూర్తి చేయకపోవడం వల్ల వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది…తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరంలో అవినీతి అంటూ ఎన్నో అసత్య ఆరోపణలు జగన్ చేసినా ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు… ఐదేళ్ల పోలవరం నష్టం చూస్తుంటే బాధ, కోపం, ఆవేశం కలుగుతున్నాయి అంటూ చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *