Recent Posts

రూ.100 లక్షల కోట్లతో పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్‌ ప్లాన్‌ను అవిష్కరించిన ప్రధాని

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘’ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్‌ ప్లాన్‌ను‘’ బుధవారం వర్చువల్ పద్దతిలో ఆవిష్కరించారు.ఈ సందర్బం ప్రధాన మంత్రి మాట్లాడుతూ విదేశీ పెట్టుబడులను సులభతరం చేయడమే లక్ష్యంమన్నారు.రూ.100 లక్షల కోట్లతో ఈ పథకం రూపొందిండం జరిగిందని,25 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళికతో అడుగులు వేస్తున్నమన్నారు..16 మంత్రిత్వశాఖలు సమన్వయం చేస్తు,భారత దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఉమ్మడి మార్గంలోకి తేవడమే లక్ష్యంగా మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం ఈ పథకాన్ని రూపొందించారు.గతిశక్తి ప్రాజెక్టు శాఖాపరమైన లోపాలను అధిగమిస్తుందని,దేశ మౌలిక సదుపాయాల రంగంలో ఇది చారిత్రక పథకమని వివరించారు.కేంద్ర మంత్రిత్వ శాఖలు,డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన ప్రస్తుత, ప్లాన్‌డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాల కోసం ఓ కేంద్రీకృత పోర్టల్‌ను ఈ పథకం క్రింద ఏర్పాటు చేస్తారు.పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల సృష్టి, లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుదల, సప్లయ్ చైన్స్ మెరుగుదల, అంతర్జాతీయ పోటీకి స్థానిక వస్తువులు నిలవడం వంటివి గతిశక్తి వల్ల సాధ్యమవుతాయని పేర్కొన్నారు.ప్రభుత్వ పనులు త్వరతిగతిని పూర్తి కావని ప్రజలు భావించేవారని,అయితే ప్రజల్లో వున్న అపోహాలను తమ ప్రభుత్వం మార్చివేసిందన్నారు..

Spread the love