Recent Posts

తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ప్రణాళికలు

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 16 నుంచి న్యూ అకాడమిక్ ఇయర్ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం.. 8వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు..గతే సంవత్సరం లాగే విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..కరోనా వ్యాప్తి తగ్గు ముఖం పడితే వచ్చే నెల(జులై)లో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది..జులై నెలాఖరు నాటికి కరోనా తగ్గుతుందన్న ఆంచనాలతో స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవచ్చింది..

Spread the love