Recent Posts

అజిత్రో మైసిన్ కంటే ప్లాసిబో మెడిసిన్ మేలైన‌ది-శాస్త్రవేత్తలు

అమరావతి: క‌రోనా పాజిటివ్ తో హోం క్వారైన్ టైన్ లో వున్నవారికి డాక్టర్లు అజిత్రో మైసిన్ మెడిసిన్‌ను రిఫ‌ర్ చేస్తున్నారు..అయితే అజిత్రో మైసిన్ కంటే ప్లాసిబో మెడిసిన్ మేలైన‌ద‌ని, అజిత్రో మైసిన్ ను వినియోగించ‌డం వ‌ల‌న ఆసుప‌త్రుల్లో చేరాల్సిన అవ‌స‌రం రావొచ్చ‌ని పరిశోధ‌కులు తెలిపారని Journal of the American Medical Association పేర్కొంది.కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్ కు చెందిన ప‌రిశోధ‌కులు చేసిన ఈ ప‌రిశోధ‌న‌ల‌లో ఈ విష‌యాలు వెలుగుచూశాయి.కోవిడ్ బారిన ప‌డి ఇళ్ల‌ల్లో చికిత్స పొందుతున్న 263 మందిలో 171 మందికి 2.1 గ్రాముల అజిత్రోమైసిన్ మొద‌టి డోస్‌ను ఇచ్చారు. మిగిలిన 92 మందికి ప్లాసిబో మాత్ర‌ల‌ను అందించారు.ఈ మెడిసిన్‌ను తీసుకున్న రెండు వారాల త‌రువాత నెగెటివ్ వ‌చ్చింది.అయితే అజిత్రో మైసిన్ తీసుకున్న వారిలో 21 రోజుల త‌రువాత 5 శాతం మందికి తిరిగి క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆసుప‌త్రుల్లో చేరారు. కానీ, ప్లాసిబో మాత్ర‌లు తీసుకున్న వారిలో ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేద‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు.. 

Spread the love