Recent Posts

తిరుమల శ్రీవారికి నిర్వహిస్తున్న సేవాలపై సుప్రీంకోర్టులో పిటిషన్

అమరావతి: తిరుమల శ్రీవారికి నిర్వహిస్తున్న వివిధ రకాల సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించడం లేదని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుకొండలవాడి భక్తుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ లో హిందూయేతరుల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలన్న నిబంధనలను పాటించడం లేదంటూ పేర్కొన్నారు..పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.తొలుత తమ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వినాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ వి రమణ, జస్టిస్ సూర్య కాంత్,జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనాన్ని కోరగా ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ స్వీకరించిన సందర్భంగా జస్టిస్‌ రమణ స్పందిస్తూ,, ‘మీరు ఎక్కడి వారని అడిగారు. తెలుగు వారమని చెప్పడంతో,జస్టిస్ ఎన్వీ రమణ కూడా తెలుగులోనే మాట్లాడుతూ మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే సహనంతో ఉండాలి అంతే కాని ప్రతి రోజూ పిటీషన్‌ను లిస్ట్‌ చేయమని రిజిస్ట్రీపై ఒత్తిడి తీసుకురాకూడదని హితవు పలుకుతూ,, మేమందరం బాలాజీ భక్తులమే” అని అన్నారు. పిటీషన్‌ను వచ్చే బుధవారం లిస్ట్‌ చేస్తూ, ఆచారాలలో అక్రమాలను ఆరోపిస్తూ శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల  ఫిర్యాదుపై స్పందించాలని సుప్రీం కోర్టు బుధవారం తిరుపతి తిరుమల దేవస్థానాన్ని కోరింది..

Spread the love