Recent Posts

బక్రీద్ కోసం కరోనా నిబంధనలను సడలించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్

అమరావతి: బక్రీద్ పండుగ కోసం కేరళ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించడంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, దీనికి కౌంటర్ ఫైల్‌ చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేరళ ప్రభుత్వం తరఫు న్యాయవాది మంగళవారం అఫిడవిట్ వేస్తామని కోర్టుకు తెలిపడంతో రేపు ఉదయం తొలి కేసుగా దీన్నే విచారిస్తామని సుప్రీం తెలిపింది.ఈనెల 21న బక్రీద్ పండుగ నేపథ్యంలో టెక్స్‌ టైల్స్, ఫుట్‌వేర్ షాపులు, జ్యువెల్లరీ, ఫ్యాన్సీ స్టోర్లు, హోం అప్లయెన్స్, ఎలక్ట్రానిక్స్‌ దుకాణాలతోపాటు సరుకులు, కిరాణా షాపులను మూడ్రోజుల పాటు కరోనా ఆంక్షల నుంచి మినహాయించాలని పినరయ్ విజయన్ సర్కార్ నిర్ణయించింది.కేరళలో కరోనా కేసులు పెరుగుతుండటం, థర్డ్ వేవ్ భయం పొంచి ఉన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ కేరళ ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కూడా కరోనా నిబంధనలను సడలించడంపై సీరియస్ అయ్యింది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కరోనా నిబంధనలను ఎలా సడలిస్తారంటూ ఐఎంఏ కేరళ సర్కారును ప్రశ్నించింది.కేరళ ప్రభుత్వం తమ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే సుప్రీం కోర్డుకు వెళ్తామని ఐఎంఏ హెచ్చరించింది. కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న టైమ్‌లో కొవిడ్ నిబంధనలను సడలించాలన్న ప్రభుత్వం నిర్ణయం దారుణమని వ్యాఖ్యనించింది.. 

Spread the love