Recent Posts

దేశంలో 5G టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్

అమరావతి: దేశంలో 5G టెక్నాలజీ అమలుకు వ్యతిరేకంగా బాలీవుడ్‌ నటి,పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు..సాంకేతికతకు తాను వ్యతిరేకం కాదని,, అయితే దాని వల్ల తలెత్తే పర్యావరణానికి హానీ కలిగించే సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.. జుహీచావ్లా తరఫున ప్రముఖ న్యాయవాది దీపక్ ఖోస్లా ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు..ఈ పిటీషన్‌పై తొలి విచారణ సోమవారం జరిగింది..దేశంలో కొత్తగా ప్రవేశపెట్టదలిచిన 5G నెట్‌వర్క్‌ వల్ల సంభవించబోయే నష్టాన్ని ఎవరూ అంచనా వేయలేరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు..ఇప్పుడున్న 4G టెక్నాలజీ, ఇతర సాంకేతిక నెట్‌వర్క్‌తో పోల్చుకుంటే.. 5G వంద రెట్లు అత్యంత ప్రమాదకరమని చెప్పారు. దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాలను తన పిటీషన్‌కు జత చేశారు. జంతువులు, పక్షులు, ఇతర క్రిమి కీటకాల మనుగడ ప్రశ్నార్థకమౌతుందని పేర్కొన్నారు. వాటికి మాత్రమే కాకుండా.. మనుషుల డీఎన్ఏ నిర్మాణం సైతం ధ్వంసమౌతుందని చెప్పారు..5Gనుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ వల్ల కొన్ని రకాల పక్షులు,,జీవాలు నాశనమౌతాయన్నారు..భూమి మీద నివసించే ప్రజలకే కాదు,, కడుపులో ఉన్న పిండాన్ని సైతం దెబ్బ తీసేంతటి శక్తిమంతమైన రేడియో ఫ్రీక్వెన్సీని 5G విడుదల చేస్తుందని స్పష్టం చేశారు..ప్రజలు,,పక్షులు,, జంతువుల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు ఏ ఒక్కరికీ లేదా ఏ సంస్థకూ లేదని తేల్చి చెప్పారు..5G టెక్నాలజీ వల్ల ఎలాంటి ముప్పు ఉండబోదని తేలేంత వరకూ దాన్ని అమలు చేయొద్దని జుహీచావ్లా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు..ఇదివరకు బెల్జియం కూడా 5G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని రావడాన్ని అడ్డుకుందని గుర్తు చేశారు..అనారోగ్య కారకం కాదని తేలిన తరువాతే,,ఆ దేశం ఆ పరిజ్ఞానాన్ని అమల్లోకి తెచ్చిందని ఆమె గుర్తు చేశారు. సెల్యులార్ నెట్‌వర్క్ కింద అనారోగ్యానికి గురైన వారికి చికిత్సను అందించడానికి బీమా కంపెనీలు కూడా అంగీకరించట్లేదని చెప్పారు..అమెరికా,,బ్రిటన్,,కెనడా వంటి దేశాల్లో ఈ పరిస్థితి ఉందని పేర్కొన్నారు..రేడియో ఫ్రీక్వెన్సీ,,కంటికి కనిపించని ఎలక్ట్రోమ్యాగ్నటిక్ కాలుష్యానికి కారణమౌతోందని చెప్పారు.. ప్రస్తుత కాలంలోనే కాకుండా, రాబోయే కాలంలో కూడా ఈ టెక్నాలజీ సురక్షితమా కాదా అనే అధ్యయనం చేయాలని,,ఇందులో ప్రైవేటు వ్యాపార సంస్థల భాగస్వామ్యం ఉండరాదని జూహీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు..

Spread the love