Recent Posts

శ్రీవారి భక్తులకు శుభవార్త-సర్వదర్శనం టోకన్లు పెంచుతున్నట్లు ప్రకటించిన-టీటీడీ

తిరుపతి: శ్రీవారి సర్వదర్శనానికి అందరికీ అనుమతించాలని దేవస్థానం నిర్ణయం తీసుకుంది..శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 2 వేల నుంచి 8 వేలకు పెంచుతూన్నట్లు ఆదివారం టీటీడీ ప్రకటన విడుదల చేసింది..ఇవాళ ఉదయం నుంచి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతో పాటూ దర్శన సమయంను పెంచింది.నేటి నుంచి రాత్రి 12 గంటలకు స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించనుంది.దింతో రాత్రి 12 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. కరోనా కారణంగా గతేడాది లాక్ డౌన్ నుంచి రాత్రి 9 గంటలకే ఏకాంత సేవ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తూ వస్తున్నారు..తిరుపతి శ్రీనివాసం వసతి సముదాయం టిక్కెట్ల కౌంటర్లు వద్ద టోకెన్లు జారీ చేస్తున్నారు.ఆధార్ కార్డు కలిగిన ప్రతి భక్తుడికి ఈ అవకాశాన్ని కల్పించారు.త్వరలోనే ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంచుతామని టీటీడీ ప్రకటించింది..

Spread the love