AMARAVATHINATIONAL

ప్రభుత్వ సుస్థిరత, నిజాయితీని నమ్మడంతోనే ప్రజలు మళ్లీ అవకాశం ఇచ్చారు-రాష్ట్రపతి

అమరావతి: లోక్‌సభ సమావేశాలు 4వ రోజు ప్రారంభమైన సందర్బంగా, 18వ లోక్‌సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  తొలిసారి ప్రసంగించారు..2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు..దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచి లోకసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరని భావిస్తున్నట్లు చెప్పారు.. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు..భారతదేశ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ,, సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు..ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించిందని,,దేశ ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించి మళ్లీ పట్టం కట్టారన్నారు..ప్రభుత్వ సుస్థిరత, నిజాయితీని నమ్మడంతోనే ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు.. రిఫార్మ్‌,, పర్‌ఫార్మ్‌,,ట్రాన్స్‌ ఫార్మ్‌ ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడించారు..గడిచిన పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేయడంతో పాటు పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు..త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *