Recent Posts

24 గంటల్లో ICICI బ్యాంకు నగదును దొంగలించిన వ్యక్తులు అరెస్ట్-ఎస్పీ విజయరావు

నెల్లూరు: మంగళవారం ICICI  బ్యాంకు సంబంధించిన నగదును తీసుకుని వెళ్లె వ్యాన్ డ్రైవర్,వ్యాన్ లో వున్న రూ.50 లక్షల నగదు,వ్యాన్ తో పాటు పరారీ కాగా,వారిని 24 గంటలోపు ఆరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ విజయరావు చెప్పారు.గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ AGS SECURE VALUE అనే కంపెనీ బ్యాంకుకు సంబంధించిన నగదును రవాణ చేస్తుందని,సదరు కంపెనీ వ్యాన్ డ్రైవర్ అయిన పోలయ్య(31),అతని స్నేహితులైన సిద్దూ(32),అతని భార్య బొందిలి.గౌరీ(32),మరోక వ్యక్తి అయిన పఠాన్.సోఫీయా(28)లతో కలసి నగదును కాజేయాలన్న పథకం వేశారన్నారు..మద్రాసు బస్టాండ్ సెంటర్లోని ఐసీఐసీఐ,బ్యాంకుకు సంబంధించిన రూ.50 లక్షల రూపాయలతో ఉన్నవాహనంలో మిగిలిన ముగ్గురుతో కలసి పోలయ్య పరారీ అయ్యడని చెప్పారు.వ్యాన్ ను అయ్యప్పగుడి సమీపంలోని నిర్జన ప్రదేశంకు చేరుకుని,వ్యాన్ సేఫ్టీ వాల్ ను పగలగొట్టి,అందులోఉన్నరూ.50 లక్షలు తీసుకుని,వ్యాన్ అక్కడే వదిలేసి,తిరుపతికి వెళ్లరని తెలిపారు.తిరుపతి చేరుకొని,దొంగతనం చేసిన డబ్బులను నాలుగురు పంచుకొని,,అక్కడి నుంచి కాణిపాకంకు వెళ్లి తలదాచుకున్నరన్నారు.బుధవారం సాయంత్రం గూడూరు రైల్వేస్టేషన్ కు చేరుకున్న వీరు అక్కడి నుంచి,ఏదైన రైలు ఎక్కివెళ్ళిపోదామని సిద్దమైయ్యారని చెప్పారు..వ్యాన్ దొంగతనం జరిగిన వెంటనే సెష్పల్ టీమ్స్ ను ఏర్పాటు చేయడంతో,గూడూరు రైల్వే స్టేషన్ వద్ద వీరిని అరెస్ట్ చేసి రూ.48,40,000 లక్షల నగదుతో పాటు వ్యాన్,రూ.72 వేల రూపాయలు విలువ చేసే రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు..ముద్దాయిలను పట్టుకోవడంలో 1 టౌన్ ఇనస్పెక్టర్ మధుబాబు,స్పెషల్ టీమ్ సిబ్బందిని అభినందించారు.అలాగే వీరికి రివార్డులు అందచేశారు.

Spread the love