Recent Posts

పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలి-ఆనం

నెల్లూరు: రెండు సంవత్సరాల విరామ అనంతరం జరుగబోవు పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని, అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రివర్యులు వెంకటగిరి ఎమ్మేల్యే ఆనం.రామానారాయణరెడ్డి అధికారులకు సూచించారు.రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మే నెల 11 నుంచి 17 వరకు జరుగనున్న దృష్ట్యా , సన్నాహక సమన్వయ సమావేశం నెల్లూరు RDO కొండయ్య ఆధ్వర్యంలో శుక్రవారం పెంచలకోన క్షేత్రములోని దేవస్థానం ఆవరణలో జరిగింది..ఈ సందర్భంలో రామానారాయణరెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆంతరంగికంగా మాత్రమే బ్రహ్మోత్సవాలు నిర్వహించారని, ప్రస్తుతం ప్రజలందరి సమక్షంలో వైభవంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండే కాకుండా కడప జిల్లా నుండి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. ముఖ్యంగా13,14 తేదీలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి, రాత్రి నిద్ర చేసి 15వ తేది తిరిగి వెళ్తారని, కావున త్వరితగతిన తమ గమ్యస్థానాలకు చేరేందుకు అధిక బస్సులు నడపాలని సూచించారు.క్యూలైన్లలో ఎటువంటి ఒత్తిడి లేకుండా చూడాలని పోలీస్ వారిని కోరారు.ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటసుబ్బయ్య, ఆత్మకూరు డి.ఎస్.పి వెంకటేశ్వరరావు, నెల్లూరు ఆర్టీవో సుశీల, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు చేన్ను తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
error: Content is protected !!