AMARAVATHIHYDERABADMOVIE

పవన్‌ కల్యాణ్, రియల్ లైఫ్‌లో కూడా ఎంత మాసో అర్థమైంది-విజయ్ సేతుపతి

హైదరాబాద్: తెలుగు,,తమిళ ప్రేక్షకుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో అయిన విజయ్‌ సేతుపతి నటించిన చిత్రం మహారాజ.. జూన్ 14వ తేదిన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్నది.. ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ గురించి ఒక్క మాటలో ఏం చెప్తారని ఓ విలేఖరి ప్రశ్నించగా పవన్‌ కల్యాణ్ కష్టపడేతత్వాన్ని నేను చాలా గౌరవిస్తా… ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడన్నప్పుడు చాలా ట్రోల్స్‌ వచ్చాయి… అయితే వాటికి వెరవ కుండా ఆయన తొడగొట్టినప్పుడు రియల్ లైఫ్‌లో కూడా ఎంత మాసో అర్థమైంది… ఏం జరిగినా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం…ఎవరి కథలోనో ఆయన హీరో కాదు…ఆయన సొంత కథలో ఆయనే హీరో అంటూ సమాధానం ఇచ్చారు..అలాగే పవర్‌స్టార్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *