Recent Posts

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం

అమారవతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం..ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 4వ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదిన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయని సమాచారం,,అలాగే రెండో విడత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్నాయి..ఇప్పటికి కరోనా వల్ల అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున నేపధ్యంలో ఈ బడ్జెట్‌లో సామాన్యులకు ఊరట లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా చిరు వ్యాపారులకు ఉతంఇచ్చే ప్యాకేజీలు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది..పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదిన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదిన ముగుస్తాయి.దేశంలో వేగంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు అటు ఇటుగా వున్న  నమోదు అవుతున్న సమయంలో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది.సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది..

Spread the love
error: Content is protected !!