Recent Posts

ఆఫ్ఘ‌నిస్తాన్‌కు వెళుతున్న భారత్ గోధుమల ట్రక్కులను నిలిపివేసిన పాకిస్తాన్

అమరావతి: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో రోజు రోజుకు ల‌క్ష‌లాది మంది తీవ్ర‌మైన ఆహార కొర‌త‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. వారి ఇబ్బందులను గ‌మ‌నించిన అనేక దేశాలు మాన‌వ‌తా దృక్ప‌ధంతో ఆహార‌ప‌దార్ధాల‌ను స‌ర‌ఫ‌రా చేసి ఆదుకుంటున్నారు.. ఆఫ్ఘన్ ప్రజలను అదుకునేందుకు ఇండియా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు 50 వేల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ముందుకు వ‌చ్చింది.ఇండియా నుంచి పాక్ మీదుగా ఈ గోధుమ‌ల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు 5వేల ట్ర‌క్కుల‌ను వినియోగిస్తున్న‌ది. ట్ర‌క్కుల్లో గోధుమ‌ల‌ను నింపి పాక్ నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్‌కు రోడ్డు మార్గం ద్వారా చేర‌వేయాలి. అయితే, పాక్‌లోకి ప్ర‌వేశించిన ట్ర‌క్కుల‌ను పాక్ అధికారులు నిలిపివేశారు. మాన‌వ‌తా దృక్ప‌ధంతో ఆహార‌ధాన్యాల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్ కు అంద‌జేసేందుకు తీసుకెళ్తున్నామ‌ని భార‌త్ ముందుగానే పాక్‌కు స‌మాచారం అందించింది..అయిన‌ప్ప‌టికి ఇప్ప‌టి వ‌ర‌కు పాక్ అధికారులు అనుమ‌తులు ఇవ్వ‌లేదు. ఇండియా ట్ర‌క్కులు పాక్ నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్ వెళ్లేందుకు లాజిస్టిక్ రూల్స్ ఒప్పుకుంటాయా లేదా అని ప‌రిశీస్తున్న‌ట్టు పాక్ అధికారులు చెబుతున్నారు..ఒక వైపు ఆఫ్ఘన్ ప్రజలు పస్తులతో అల్లాడిపోతున్నా,పాక్ తన నీచమైన బుద్దిని చూపిస్తునే వుంది..ఎందుకంటే గోధుమలు ఆఫ్ఘన్ కు చేరితే,అక్కడ ప్రజలు ఇండియాపై అభిమానం చూపుతరనే పాక్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.. ప్ర‌స్తుతం పాక్ అధికారుల అనుమ‌తి కోసం ఇండియా లారీలు ప‌డిగాపులు వాఘా-అటారీ సరిహద్దుల వద్ద ప‌డిగాపులు కాస్తున్నాయి..

Spread the love
error: Content is protected !!