Recent Posts

స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఉగ్రదాడులకు పాక్ ఐఎస్ఐ కుట్ర

అమరావతి: పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రమూకలు నిరంతరం భారతదేశంలో ఏదోక రూపంలో దాడులకు పాల్పండేందుకు ప్రయత్నిస్తునే వుంటారు..ఈనేపధ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు (ఆగస్టు 15),ఉగ్రదాడులకు పాల్పడాలని పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.దాడులకు సంబంధించి ఉగ్రమూకల మధ్య సమన్వయం చేసేందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఐఎస్ఐ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. రహస్యంగా వాస్తవాదీనరేఖ ద్వారా జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడేందుకు 8 కొత్త మార్గలను గుర్తించినట్టు కనుగొన్నారు.ఇందుకు వివిధ టెర్రరిస్టు బృందాల మధ్య జోరుగా సమావేశాలు జరుగుతున్నాయని, నిషిద్ధ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, ఆల్-బదర్ తో బాటు ముజఫరాబాద్ లోని కొత్త బెలా బందీ అనే ఉగ్రవాద సంస్థ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నట్టు గూఢాఛార వర్గాలు వెల్లడించాయి.ఐఎస్ఐ గుర్తించిన ఎనిమిది రూట్లను స్ఫష్టంగా తెలియ చేశాయి.. సరిహద్దుల్లోకొత్తగా 27 టెర్రరిస్టు పాడ్లను ఈ సంస్థ యాక్టివేట్ చేసిందని,ఈ నెల 15వ తేదికి ముందే ఈ మార్గల ద్వారా కాశ్మీర్ లోకి చొరబడాలన్నది వీరి ప్లాన్ అన్నవిషయం పసిగట్టాయి..జూన్ నుంచే సుమారు 146 మంది ఉగ్రవాదులు వివిధ లాంచ్ పాడ్ల వద్ద మోహరించినట్టు సమాచారం.ఇదే సమయంలో జమ్మూ ప్రాంతంలో ఎగురుతున్న నాలుగు డ్రోన్ల వంటి వస్తువులను గుర్తించారు.ఆదివారం రాత్రి మూడు వస్తువుల తాలూకు వీడియోలను స్థానికులు తమ మొబైల్స్ లో చిత్రీకరించి,ఈ సమాచారాన్ని భద్రతా దళాలకు పంపారు.అయితే సెక్యూరిటీ దళాలు సెర్చ్ చేసినా ఫలితం లేకపోయింది.ఈ కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ మొత్తం భద్రతను కట్టుదిట్టం చేశారు..

Spread the love