Recent Posts

యువతను అకట్టుకుంటున్నఓఎక్స్ఓ(OXO) ఎలక్ట్రిక్ బైక్‌

అమరావతి: దేశంలో గత సంవత్సర కాలంగా పెట్రోల్ ధరలు పెరగుతుండటంతో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనల డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది..వినియోగదారుల అవసరాలు,,డిమాండ్ దృష్టిలో పెట్టుకొని అనేక కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి..అలాంటి కంపెనీల్లో ఒకటైన హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఒకటి..హోప్ ఎలక్ట్రిక్ త్వరలో దేశీయ మార్కెట్లో తన టాప్ ఎండ్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌,ఓఎక్స్ఓ(OXO) విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జైపూర్‌కు చెందిన ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ త్వరలో ఓఎక్స్ఓ(OXO)ను మార్కెట్లోకి తీసుకొని రావడం కోసం టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తుంది..Hop, OXO బైక్ డిజైన్, స్టైలింగ్ స్పోర్ట్స్ బైక్ తరహాలో ఉన్నాయి..ఆల్-ఎల్ఈడి సెటప్ తో ట్రెండీ వైజర్, స్పియర్ ఆకారంలో టర్న్ ఇండికేటర్లు, స్లీక్ ఎల్ ఈడి డిఆర్ఎల్, సింగిల్ సీట్ డిజైన్, షార్ట్ టెయిల్ సెక్షన్ వంటి కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి..బైక్ ఏరోడైనమిక్ ప్రొఫైల్ కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది..ఏరోడైనమిక్ వల్ల బైక్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది…హోప్ ఓఎక్స్ఓ టాప్ స్పీడ్ గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని,,బైక్ 30 సెకన్ల లోపు తన టాప్ స్పీడ్ చేరుకుంటుదనే అభిప్రాయం మాక్కట్ విశ్లేషకులు భావిస్తున్నారు..దీనిని ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు సమాచారం..ఓఎక్స్ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే, సింగిల్ లేదా డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ తో రావచ్చని తెలుస్తుంది..వాహన వినియోగాదారులు కోరుకునే అన్ని ఫీచర్స్ ఈ కొత్త Hop Oxo ఎలక్ట్రిక్ బైక్ లో ఉంటాయని కంపెనీ వెల్లడించింది..

Spread the love