బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా
ఢిల్లీకి చేరుకున్న హసీనా..
అమరావతి: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్‌ల వివాదం హింసాత్మకంగా మారడంతో, దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు.. రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమె రాజీనామా చేయకతప్పలేదు.. ఆదివారం ఒక్కరోజు చెలరేగిన అల్లర్లతోనే దేశవ్యాప్తంగా 72 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు.. సోమవారం ఆందోళనకారులు బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో షేక్ హసీనా ఢిల్లీ లోని ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ 5.30 గంటలకు చేరుకున్నారు.. గడిచిన 15 ఏళ్లుగా బంగ్లాదేశ్‌ను పాలిస్తున్న షేక్ హసీనాకు తాజా ఆందోళనలు సవాలుగా మారాయి.. రాజధాని రోడ్లపై నిరసనకారులు ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు.. రాజధానిని జిల్లాలకు కలిపే మార్గాలన్నింటిని మూసేశారు.. సిరాజ్ గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఆందోళనకారుల దాడిలో ఏకంగా 13 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు.. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు..ఇందుకు ప్రతిపక్షపార్టీ వారికి పూర్తి మద్దతూ ప్రకటించింది.. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో అశువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా అమలులో ఉంది..ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా పట్టం కట్టాలని అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..ఈ నేపధ్యంలో విద్యార్దులు జరిపిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో,,ఈ అల్లర్లలో పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగింది.. అల్లర్లకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.. అయితే నిరసన ప్రదర్శనలను షేక్ హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకించింది..దీంతో ఆందోళనకారులు, అవామీ లీగ్ పార్టీ నాయకులు మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి.