Recent Posts

44 కోట్ల వ్యాక్సీన్ డోసులకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది-Dr.V.K  పాల్

అమరావతి: దేశంలోని 18 సంవత్సరాలు పైబడిన వారందరీకి ఈనెల 21వ తేది నుంచి ఉచితంగా వ్యాక్సీన్ లు వేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించి 24 గంటలు గడిచే సరికి కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా వేగంగా చర్యలు చేపట్టింది.. మంగళవారం 25 కోట్ల కోవిషీల్డ్ డోసులకు,,19 కోట్ల కొవ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చినట్టు నీతీ అయోగ్ సభ్యుడు Dr.V.K  పాల్ మీడియ సమావేశంలో ప్రకటించారు..సీరం ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ ఇండియా,, భారత్ బయోటెక్‌ సంస్థలకు వ్యాక్సీన్స్ ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపారు..ఇప్పటికే కుదుర్చుకున్న టీకా కొనుగోలు ఒప్పందాలకు ఇది అదనమన్నారు..కొవ్యాక్సిన్,, కోవిషీల్డ్ కలిపి మొత్తం 44 కోట్ల కరోనా వ్యాక్సీన్స్ డోసులు డిసెంబర్ నాటి కల్లా విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని,, వ్యాక్సీన్ కొనుగొలుకు అయ్యే ఖర్చులో దాదాపు 30 శాతం మొత్తాన్ని అడ్వాన్స్‌ గా సీరం,,భారత్ బయోటెక్‌కు విడుదల చేశామని తెలిపారు..బయాలాజికల్ ఈవాన్స్(BE) సంస్థ తయారు చేస్తున్న కరోనా టీకాను కోనుగోలు చేస్తామని,,ఇప్పటికే 30 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చామని చెప్పారు..బయోలాజిక్ ఈవాన్స్ సంస్థ తమ వ్యాక్సీన్ ధరను ప్రకటించేందుకు ఎదురు చూస్తున్నమని,,కంపెనీతో జరుగుతున్న చర్చలపై ఈ ధర ఆధారపడుతుందన్నారు..కేంద్రం ఇప్పటివరకూ చేసిన ఆర్థిక సాయాన్ని టీకా కొనుగులు ఖర్చుల కింద సర్దుబాటు చేస్తామని పేర్కొన్నారు.. BE వ్యాక్సీన్ కు సంబంధించి ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారం చాలా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పారు..

Spread the love